
జోరు మీదున్నావే రష్మికా.. నీ జోరులో భాగమవుతా రష్మికా అంటూ కొత్త పాట పాడుతున్నారు సల్మాన్ భాయ్. కొన్నాళ్లుగా సల్మాన్ కెరీర్ ఫ్లాప్ లో ఉంది. ఇప్పుడు ఆయన కెరీర్‌ని బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత రష్మికదేనా...

పూర్తిగా అదృష్టమని చెప్పాలా? లేకుంటే.. ఆమె కష్టానికి తగ్గ ప్రతి ఫలమనాలా.. రెండూ కలగలిసిన అరుదైన కలయిక అనాలా.. రష్మిక కెరీర్‌ని ఎలా డిఫైన్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ అందరినీ మెప్పిస్తున్నారు ఈ నేషనల్ క్రష్.

ఎక్కడి విషయాలు అక్కడే.. ఎక్కడి శ్రమ అక్కడే.. ఏదీ ఇంకో చోటికి మోయడం, చేరవేయడం నాకు తెలియదు. నాలో నాకు బాగా నచ్చిన విషయం అదేనంటూ సక్సెస్ సీక్రెట్‌ని ఆల్రెడీ రివీల్ చేశారు మిస్ మందన్న.

తెలుగులోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఆమె చేసిన సినిమాలన్నీ సక్సెస్ టాక్‌తో నడిచినవే. మిషన్ మజ్నులాంటి మూవీ ఓటీటీలో రిలీజ్ అయినా, రష్మికకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ వెంటనే చేసిన యానిమల్, పుష్ప రెండు చాప్టర్లు, ఇప్పుడు ఛావా.. ఆమె కెరీర్ గ్రాఫ్‌ని పైపైకే తీసుకెళ్తున్నాయి.

లేటెస్ట్ గా సల్మాన్‌ఖాన్ సికిందర్‌లో నటిస్తున్నారు రష్మిక మందన్న. ఆమె మిడాస్ టచ్ ఈ మూవీ రిజల్టులో మేజిక్ చేస్తుందన్నది మేకర్స్ మాట. ఆ సక్సెస్ స్ట్రీక్‌ని నేషనల్ క్రష్ అలాగే కంటిన్యూ చేయాలని విష్ చేస్తున్నారు నెటిజన్లు.