
తెలుగులో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ తోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంటున్నారు. కొంతమంది ఒక్క సినిమాతో పాపులర్ అవుతుంటే మరికొంతమంది మాత్రం నటిగా తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే ఇతర బాషల నుంచి వచ్చి కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న భామలు చాలా మందే ఉన్నారు అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు.

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఈ అమ్మడు చేసిన కామెట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. నివేదా పేతురాజ్.. ఈ చిన్నది తన అందంతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నివేదా పేతురాజ్.

తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. మెంటల్ మదిలో సినిమా తర్వాత చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నివేదా పేతురాజ్ క్రేజ్ పెరిగింది. ఆతర్వాత బ్రోచేవారెవరురా సినిమా చేసింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా చేసింది.

ఈ సినిమా తర్వాత బ్లడీ మేరీ, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ, బూ, పరువు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది నివేదా పేతురాజ్.. మొన్నామధ్య తన ప్రియుడిని పరిచయం చేసింది. కానీ ఆతర్వాత ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీగా మారింది నివేదా పేతురాజ్. ఇటీవలే సింగ్ గీతం సినిమాలో నటించింది.

ఇక ఇప్పుడు ఈ అమ్మడికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి రెడ్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో నివేదా పేతురాజ్. పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇక ఇప్పుడు రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది