
న్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం. అయితే పెళ్లి, పిల్లల తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోంది పూర్ణ. ఇటీవలే బాలయ్య నటించిన అఖండ 2 తాండవం సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసిందీ అందాల తార.

సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఈ శుభవార్తను కొన్ని రోజుల క్రితమే వెల్లడించింది పూర్ణ.

మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బిజినెస్‌మ్యాన్‌ని సీక్రెట్ పెళ్లి చేసుకుంది పూర్ణ. ఇప్పటికే ఈ దంపతులకు హమదన్ అసిఫ్ అలీ అనే కుమారుడు ఉన్నాడు.

ఇప్పుడు మరోసారి గర్బం ధరించిన పూర్ణ తాజాగా మెటర్నిటీ ఫొటోషూట్ లో పాల్గొంది. తన భర్త, కుమారుడితో కలిసి సరదాగా ఫొటోలకు పోజులిచ్చింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల, నెటిజన్లు పూర్ణ దంపతులకు ముందుస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.