Controversy Movies: ఈ సినిమాలు సమ్మర్ వేడిని మరింతా పెంచనున్నాయా.? నిజం ఎంత.?

Edited By: Prudvi Battula

Updated on: Mar 09, 2024 | 12:11 PM

దారిన పోయే వివాదాన్ని ఎవరైనా ఇంటికి పిలుస్తారా చెప్పండి..? కానీ పిలుస్తున్నారు.. మన ఇండస్ట్రీలో కొందరు దర్శకులు అలాంటి కాంట్రవర్సీ ఉన్న కథల్నే ఎంచుకుంటున్నారు.. వివాదం ఉన్న సినిమాలనే చేస్తున్నారు. ఈ సీజన్‌లో మూడు భారీ కాంట్రవర్షియల్ మూవీస్ వచ్చేస్తున్నాయి. వాటి గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నాయి. మరింతకీ ఏంటా వివాదాస్పద సినిమాలు..?

1 / 5
మరుగున పడిన చరిత్రను చూపిస్తున్నాం.. ఈ మధ్య కాంట్రవర్సీ సినిమాలు చేసే ఏ దర్శకుడిని అడిగినా చెప్తున్న సమాధానమిదే. మార్చి 15న విడుదల కానున్న రజాకార్‌పై కూడా ఎన్నో వివాదాలు రేగుతున్నాయి. ఇందులో ముస్లింలను తప్పుగా చూపిస్తున్నారంటూ ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి.

2 / 5
గతేడాది కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సుదీప్తో సేన్. లవ్ జీహాద్‌ నేపథ్యంలో వచ్చిన కేరళ స్టోరీ ఏకంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం చాల ప్రాంతాల్లో బ్యాన్ చేసారు. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ అందుకుంది.

3 / 5
ఇప్పుడు బస్తర్‌ అంటూ మరో కాంట్రవర్సల్ చిత్రంతో వస్తున్నారు. అప్పట్లో బస్తర్‌ జిల్లాలోని సుక్మాలో నక్సలైట్స్ దాడిలో 76 మంది జవాన్లు చనిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ విషయాన్నే బస్తర్‌లో చూపిస్తున్నారు సుదీప్తో సేన్. ట్రైలర్ చూస్తుంటే మరో కాంట్రవర్సీ ఖాయంగానే కనిపిస్తుంది.

4 / 5
బాలీవుడ్‌లో బస్తర్ తో పాటు వీర్ సావర్కర్‌పై కూడా చర్చ బాగానే జరుగుతుంది. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ బయోపిక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రణ్‌దీప్ హూడా. ఈ చిత్రంలో టైటిల్ రోల్ ఆయనే చేస్తున్నారు. 

5 / 5
ఈ మూడు వివాదాస్పద సినిమాలు వారం గ్యాప్‌లో వస్తున్నాయి. హైదరాబాద్ నేపథ్యంలో రజాకర్, హిందీలో బస్తర్ మార్చి 15న వస్తుంటే.. వీర్ సావర్కర్ మార్చి 22న ప్రేక్షకులు ముందుకు రానుంది. మరి చూడాలి ఈ మూడు చిత్రాలు ఎలాంటి వివాదాలకు దారి తియ్యనున్నాయో. 