
అందాల ముద్దుగుమ్మ సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ఈ బ్యూటీ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతుంటారు.

సిరి హనుమంత్ బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన తర్వాత చాలా నెగిటివిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ తర్వాత ఈ అమ్మడు వాటిని పట్టించుకోకుండా కెరీర్ పై ఫోకస్ పెట్టి, వరసగా షోలు చేస్తూ గడిపేస్తుంది.

జబర్దస్త్ కామెడీ షోకు కొన్ని రోజులపాటు యాంకర్‌గా చేసిన ఈ అమ్మడు, ఈ మధ్య వైజాగ్‌లో హెచ్ కే పర్మినెంట్ మేకప్ క్లినిక్‌ను ప్రారంభించి, వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.

ఒక వైపు బిజినెస్ వ్యవహారం చూసుకుంటూ మరో వైపు, బుల్లితెరపై వరసగా షోలు చేస్తూ వస్తుంది. అంతే కాకుండా ఈ చిన్నది నవరస రోమియో జూలియట్ సినిమాలో కూడా నటిస్తుంది.

ఇక ఏకాస్త సమయం దొరికినా సరే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ డిఫరెంట్ స్టైల్‌లో రెడీ అయ్యి తన అంద చందాలతో మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ టైట్ డ్రెస్‌లో తన అంద చందాలతో కుర్రకారును మాయ చేస్తుంది.