ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పటికీ అదే అందం..! 50ఏళ్ల వయసులోనూ ఇలా

Updated on: Nov 21, 2026 | 8:20 AM

కేరళకు చెందిన సితార 1986లో మలయాళ చిత్రం 'కావేరి'తో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. తమిళ చిత్రసీమలోనూ అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .

1 / 5
కేరళకు చెందిన సితార 1986లో మలయాళ చిత్రం 'కావేరి'తో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. తమిళ చిత్రసీమలోనూ అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన 'పుదు పుదు అర్థంగళ్' చిత్రంతో తమిళ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

2 / 5
ఈ సినిమాలోని 'కేలడి కన్మణి' పాటతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తమిళంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న సితార.. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ వరుస సినిమాలు చేశారు. అప్పటి అగ్ర హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగులో 'మనసు మమత', 'జీవన చదరంగం', 'శుక్రవారం మహాలక్ష్మి', 'మా వారికి పెళ్లి' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. 

3 / 5
సితార వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే.. ఆమె ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. అయితే దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తండ్రి పరమేశ్వరన్ నాయర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో చాలా అనుబంధం ఉండేదని తెలిపారు. పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా వెళ్లి ఉండటం ఇష్టం లేక అప్పట్లో వివాహం గురించి పెద్దగా ఆలోచించలేదని చెప్పారు. ఆ తర్వాత తండ్రి మరణించడంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందని వెల్లడించారు.

4 / 5
తనకు పెళ్లి సంబంధాలు వచ్చినప్పటికీ వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకోలేదని, ఒంటరిగా ఉండటంలోనే సంతోషంగా ఉన్నానని గతంలో పేర్కొన్నారు. ఒకప్పుడు కథానాయికగా వరుస సినిమాలు చేసిన సితార.. కాలక్రమేణా తన పాత్రల ఎంపికలో మార్పులు చేసుకున్నారు. హీరోయిన్ అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. 'స్నేహం కోసం', 'బృందావనం', 'లెజెండ్', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు తల్లి, కుటుంబ సభ్యుల పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

5 / 5
 వయసు పెరుగుతున్నా సితార మాత్రం నటనకు విరామం ఇవ్వడం లేదు. తెలుగు సినిమాలతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ పనిచేశారు. 2025లో వచ్చిన తమిళ చిత్రం 'మారీసన్'తో పాటు 2026లో విడుదలైన 'సన్నిధానం పి.ఓ', 'తీర్థరూప తందెయవరిగా' వంటి చిత్రాల్లోనూ కనిపించారు. ఇలా నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ నటిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 53 ఏళ్ల వయసులో ఉన్న సితార.. వ్యక్తిగత జీవితంలో పెళ్లి చేసుకోకుండా తనదైన పద్ధతిలో జీవిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా అభిమానుల కలల రాణిగా నిలిచిన ఆమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. 

Loading...
Unable to load recommendations.
Follow Us