Rajeev Rayala |
Nov 05, 2024 | 1:29 PM
అందాల భామ సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఎప్పుడెప్పుడు తిరిగి సినిమాలు చేస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సామ్ హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
అలాగే తెలుగులోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యింది ఈ వయ్యారి భామ. ఇక సమంత ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ తన సిరీస్ ను ప్రమోట్ చేసుకుంటుంది ఈ బ్యూటీ.
ఈ క్రమంలోనే నెటిజన్స్ తో ముచ్చటించింది. సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పింది సామ్. ఇక అభిమానులు సమంతకు తెగ ప్రపోజ్ చేశారు. అలాగే కొద్దిగా వెయిట్ పెరగొచ్చు కదా? అంటూ ఓ నెటిజన్ అన్నాడు. దానికి కౌంటర్ ఇచ్చింది.
బరువు గురించి ఎందుకు.? నేను ఇప్పుడు ఉన్న కండీషన్, మెయింటైన్ చేసే డైట్‌కి ఇలానే ఉంటాను.. నేను బరువు పెరగను. మీది మీరు చూసుకోండి. ఎదుటివారిని జడ్జ్ చేయకండి అని సీరియస్ అయ్యింది సమంత.
అలాగే సినిమాల్లో తన పాత్రల గురించి మాట్లాడుతూ.. నేను ఎప్పుడు మంచి పాత్రలే ఎందుకోవడానికి ట్రై చేస్తా.. గతంలో తన రోల్స్ విషయంలో కొన్ని తప్పులు చేశానని, వాటిని ఒప్పుకుంటున్నా.. ఇప్పుడు జాగ్రత్తపడుతున్నా అని చెప్పుకొచ్చింది.