ఏమాయ చేశావే సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న సమంత, వరస బ్లాక్ బస్టర్స్ హిట్ అందుకుంటూ టాలీవుడ్‌నే షేక్ చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని, వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది.
ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో, టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. సమంత నటిస్తుంది అంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ ఆ రోజుల్లో మార్మోగిపోయింది.
ఇక కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోవడం, తర్వాత డివోర్స్, మయోసైటీస్ ఇలా అనేక సమస్యలు సమంతను వెంబడించాయి.
దీంతో ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సామ్. అయితే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. మల్లెపూలు పెట్టుకుని అందంగా ఉన్న సమంత చిన్ననాటి ఫొటో ట్రెండ్ అవుతుంది.
ఇది చూసిన వారందరూ మల్లెపూలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా అంటూ, ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. మరీ ఆ ఫొటోపై మీరు ఓ లుక్ వేయండి.