
పావని కరణం 2023లో రిలీజైన పరేషాన్ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరపై అడుగు పెట్టి మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఆ సినిమాలో ఈ బ్యూటీ తన నటతో ఆకట్టుకున్నప్పటికీ హీరోయిన్‌గా అంతగా అవకాశాలు రాలేదు. దీంతో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి, చివరకు పాన్ ఇండియా సినిమాలోనే ఆఫర్ కొట్టేసింది.

పావని సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.

పుష్పలో చిన్న పాత్రలో కొద్దిసేపే కనిపించిన ఈ బ్యూటీ, పుష్ప2లో మాత్రం కీలక పాత్రలో నటించి, అందరినీ మెప్పించింది. దీంతో ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.చిన్ననాయనా అంటూ.. అల్లు అర్జున్‌ను పిలుస్తూ..తన నటనతో ఆకట్టుకుంది.

ఇక తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటో షూట్‌తో వావ్ అనిపించింది.పర్పుల్ కలర్ డిజైనరీ డ్రెస్‌ల అందాల విందు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.