"ఎవరు మీలో కోటీశ్వరుడు" సోషల్ మీడియాలో ప్రోమోతో తో పాటు వైరల్ అవుతున్న ఫొటోస్..
జూ. ఎన్టీఆర్ ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతూనే.. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా అలరిస్తున్నాడు.
ఇప్పటికే బిగ్ బాస్ లో హోస్ట్ గా చేసిన బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ మరోసారి ఎవరు మీలో కోటీశ్వరులు షో ని హోస్ట్ చేస్తున్నాడు.
జెమిని టివిలో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షో త్వరలో ముగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ సాగిన ఈ షో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మొదటి ఎపిసోడ్‌లో రామ్ చరణ్ హాట్ సీట్ లో కూర్చున్న ఈ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కు సామాన్యులతో పాటు, అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ షోలో కనిపిస్తున్నారు.
హీరోయిన్ సమంత నవరాత్రి సందర్భంగా ఈ షోలో మెరిసిన విష్యం తెలిసిందే..
ఇక పోతే తాజగా దీపావళికి సంబంధించి ప్రోమోను రిలీజ్ అయ్యింది. అందులో తారక్ మై డియర్ ఫ్రెండ్స్ అంటూ దేవి శ్రీ ప్రసాద్ అండ్ థమన్ లను ఇన్వైట్ చేసాడు..
ఈ దీపావళి మరింత కలర్ ఫుల్ చెయ్యడానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్ అండ్ దేవి శ్రీ ప్రసాద్ లు "మీలో ఎవరు కోటీశ్వరుడు " షో లో సందడి చేయనున్నారు...