
రవితేజకు మార్కెట్ లేదని కాదు ఉంది.. కానీ దాన్ని యూజ్ చేసుకోవడంలో తడబడుతున్నారు మాస్ రాజా. ఇప్పటికీ ఈయనకు సరిపోయే కథ వస్తే.. బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. నాలుగేళ్ళ కింద క్రాక్.. రెండేళ్ళ కింద ధమాకా సినిమాలే దీనికి నిదర్శనం.

కానీ మధ్యలో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు అంటూ అనవసరపు ప్రయోగాలు చేసారు రవితేజ. తప్పు తెలుసుకుని.. హరీష్ శంకర్‌తో పక్కా మాస్ సినిమా చేయాలని మిస్టర్ బచ్చన్ చేసారు. కానీ అది కూడా అస్సలు వర్కవుట్ అవ్వలేదు.

దాంతో గ్యాప్ తీసుకోక తప్పట్లేదు మాస్ రాజాకు. ప్రస్తుతం భాను భోగవరపుతో మాస్ జాతర చేస్తున్నారు రవితేజ. ఇది ఆయనకు 75వ సినిమా. అందుకే గ్యాప్ తీసుకున్నా పర్లేదు.. పక్కా హిట్ మెటీరియల్‌తో రావాలని చూస్తున్నారు.

మాస్ జాతర తర్వాత చాలా సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటున్నారు రవితేజ. ట్రాక్ రికార్డ్ చూడకుండా.. టాలెంటెడ్ దర్శకులతో పని చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కిషోర్ తిరుమలతో అనార్కలి అనే సినిమాకు ఓకే చెప్పారు. మాస్ జాతర తర్వాత ఇమ్మీడియట్‌గా సెట్స్‌పైకి వచ్చే ప్రాజెక్ట్ ఇదే.

మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్‌తోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. కిషోర్ తిరుమల తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్‌తో బిజీగా ఉన్నారు కళ్యాణ్ శంకర్. మార్చి 29న రానుంది మ్యాడ్ స్క్వేర్. దీని తర్వాత మాస్ రాజా కథపై ఫోకస్ చేయనున్నారు కళ్యాణ్ శంకర్.