Sankranti 2024: సంక్రాంతి బరిలో వెంకీమామా.. స్టార్‌ హీరోలతో సై అంటోన్న ‘సైంధవ’

|

Oct 06, 2023 | 7:45 AM

2024 సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పటికే మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి స్టార్స్ తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించాయి. జనవరి 12 లేదా 13వ తేదీల్లో ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇప్పుడు వెంకీమామ సైతం ఈ జాబితాలోకి చేరిపోయారు

1 / 5
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతి పండగ ఎంతో ప్రత్యేకముంది. సెలవులను క్యాష్‌ చేసుకునేందుకు బడ్జెట్ చిత్రాలు, చిన్న బడ్జెట్ చిత్రాలు ఈ పండగకు క్యూ కడుతుంటాయి. ఈ క్రమంలో రాబోయే సంక్రాంతికి కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ పోటీ నెలకొంది.

2 / 5
2024 సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పటికే మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి స్టార్స్ తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించాయి.  జనవరి 12 లేదా 13వ తేదీల్లో ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇప్పుడు వెంకీమామ సైతం ఈ జాబితాలోకి చేరిపోయారు

2024 సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పటికే మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి స్టార్స్ తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించాయి. జనవరి 12 లేదా 13వ తేదీల్లో ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇప్పుడు వెంకీమామ సైతం ఈ జాబితాలోకి చేరిపోయారు

3 / 5
హిట్‌ ఫేమ్‌  శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్‌  నటించిన చిత్రం ‘సైంధవ’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం 2024 జనవరి 13న విడుదల కానుంది. ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ తదితరులు ఈ చిత్రంలో  కీలక పాత్రలు పోషించారు .

4 / 5
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు.

5 / 5
వీటితో పాటు అక్కినేని నాగార్జున నా సామిరంగా సినిమా కూడా సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే మాస్‌ మహరాజా రవితేజ నటించిన ఈగల్‌ కూడా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.  మరి ఈ పోటీలో మరిన్నిసినిమాలు వస్తాయా? లేదా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.