పవన్, మహేష్ బాబులతో సినిమాలు.. 11 ప్లాపులతో ఐరన్ లెగ్ .. 51 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..

Updated on: Jul 12, 2026 | 10:18 PM

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఆమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇప్పుడు 51 ఏళ్ల వయసులో గ్లామర్ ఫోటోలతో నెట్టింట గత్తరలేపుతుంది. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

1 / 5
బాలీవుడ్ ప్రముఖ నటి అమీషా పటేల్ సినిమా ప్రస్థానం అత్యంత ఆసక్తికరమైనదనే చెప్పాలి. 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ సరసన 'కహో నా ప్యార్ హై' చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా, అమీషాను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌ను చేసింది.

2 / 5
ఆ తర్వాత టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అయితే ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' (2001). సన్నీ డియోల్ సరసన 'సకీనా' పాత్రలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.

3 / 5
ఆ తర్వాత 'హమ్రాజ్', 'భూల్ భులయ్యా' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ, ఆ తర్వాత ఆమె కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కొంతకాలం వెండితెరకు దూరమయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, 2023లో వచ్చిన 'గదర్ 2' చిత్రంతో అమీషా పటేల్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు.

4 / 5
సన్నీ డియోల్, అమీషా పటేల్ కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయడంతో ఈ చిత్రం రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. సకీనా పాత్రపై ప్రేక్షకులకు ఉన్న ఆదరణ ఇప్పటికీ తగ్గలేదని ఈ చిత్రం నిరూపించింది. 'గదర్ 2' సాధించిన భారీ విజయంతో, ఈ ఫ్రాంచైజీలో 'గదర్ 3' నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

5 / 5
కహో నా ప్యార్ హై'తో మొదలైన ఆమె ప్రయాణం, ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని నేడు 'గదర్ 3' వరకు చేరుకోవడం ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానానికి నిదర్శనం. అమీషా పటేల్ జూన్ 9, 1975న ముంబైలో జన్మించారు. ఆమె ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు రజనీ పటేల్ మనవరాలు. సినిమా నేపథ్యం లేకపోయినప్పటికీ, చదువులో ఆమె ఎంతో ప్రతిభ కనబరిచారు.జూనియర్ ఎన్టీఆర్ సరసన 'నరసింహుడు' (2005) మహేష్ బాబు సరసన 'నాని' (2004) చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నటించారు.

Follow Us