ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లిపీటలెక్కింది. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారిపోయింది.
15 ఏళ్లకే కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ చిన్నది తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అయితే త్వరగా హైట్ పెరిగేందుకు ఆమె హర్మోన్ ఇంజెక్షన్స్ తీసుకుందంటూ రూమర్స్ వినిపించాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు. టాలీవుడ్ ముద్దుగుమ్మ హాన్సిక మోత్వానీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేసింది.
చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలోనే ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో వివాహం జరిగింది. హన్సిక త్వరగా ఎదగడానికి ఇంజెక్షన్స్ వాడారు అంటూ రూమర్స్ వినిపించాయి.
గతంలో వీటిపై స్పందించిన హాన్సిక.. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని.. హీరోయిన్ కావడం వల్ల విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోన్నట్లు తెలిపింది. 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అలాంటి పనికిరాని వార్తలు రాశారని తెలిపింది.