
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ కేతిక శర్మ.

మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అందం, అభినయం కలబోసిన ఈ చిన్నది తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కేతిక

రొమాంటిక్ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య మూవీలో చేసింది. ఈ సినిమా కూడా కేతికకు హిట్ అందించలేకపోయింది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

ఆతర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.రీసెంట్ గా పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో నటించింది.

ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి గట్టి డిమాండ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోస్ ను వదిలింది కేతిక