
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కాజల్. ఫస్ట్ మూవీతోనే నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. దీంతో ఆమెకు తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోనూ వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది.

ఇదెలా ఉంటే.. కాజల్ నటించిన ది ఇండియా స్టోరీ సినిమా హిందీలో విడుదలైంది. చేతన్ డి.కె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే, మురళీ శర్మ తదితరులు నటించారు. వ్యవసాయంలో ఉపయోగించే పురుగుమందుల వల్ల కలిగే క్యాన్సర్, వాటిలో కలిపే రసాయనాలు, పురుగుమందుల తయారీలో ఉన్న అవినీతి వంటి అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం విడుదలై ప్రతికూల సమీక్షలను అందుకుంది. ఈ సినిమాకు ముందు నుంచి మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రతికూల సమీక్షలను ఎదుర్కొని, టికెట్ అమ్మకాలలో మందగమనాన్ని చవిచూసింది. మొదటి రోజు ఇది కేవలం రూ. 16 లక్షలు మాత్రమే వసూలు చేసింది. రెండవ రోజు ఈ చిత్రం రూ. 25 లక్షలు వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తం రూ. 46 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. కేవలం 3 రోజుల్లో ఒక్క కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోవడం నిర్మాతకు పెద్ద నిరాశను కలిగించింది. ఈ చిత్రం కాజల్ అగర్వాల్‌కు కూడా ఎదురుదెబ్బ తగిలించింది.

ఆమె రాబోయే హిందీ చిత్రం 'రామాయణం'లో మండోదరి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానుంది. సామాజిక కథాంశంతో తెరకెక్కించిన ఈ కోర్డ్ డ్రామా చిత్రాన్ని 24 జూలై 2026లో థియేటర్లలో రిలీజ్ చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బి. షిండే ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ ఆలస్యం కావడం వల్ల జూలై 24న కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదలైంది.

కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ నిత్యం మనం తినే కూరగాయలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాలలో పేరుకుపోతున్న రసాయన కల్తీ చుట్టూ తిరుగుతుంది. కల్తీ ఆహారం వల్ల బ్లడ్ క్యాన్సర్ బారిన పడి ఒక చిన్నారి మరణిస్తుంది. దీంతో ఆ పాప తండ్రి తన కూతురు మరణానికి కారణమైన వ్యవస్థపై, కల్తీ పురుగుమందులను సరఫరా చేసే కార్పొరేట్ కంపెనీలపై న్యాయపోరాటానికి దిగుతాడు. అతనికి లాయర్‌గా కాజల్ అగర్వాల్ మద్దతుగా నిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా.