తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయే టాక్ షో… ఇంట్రెస్టింగ్ గేమ్ షోస్‌తో దూసుకుపోతుంది తొలి తెలుగు మాధ్యమం ఆహా. ప్రారంభించిన అతి తక్కున సమయంలోనే ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ..
డిజిటల్ రంగంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది. ఇక రోజు రోజుకీ ఆహా సబ్ స్కైబర్స్ సంఖ్య పెంచుకుంటూ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని నిరూపించుకుంటుంది ఆహా.
ఇదిలా ఉంటే.. అతి తక్కువ సమయంలో ఇంతటీ క్రేజ్ సంపాదించుకున్న ఆహా… ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో ఆహా 2.0 అవతరించనుంది. దీపావళి పండుగ సందర్భంగా ఆహా యాప్‌ను 2.0గా అప్ గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్ అందించనున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కాసేపటి క్రితమే ఈ వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గోననున్నారు.
అల్లు అరవింద్, జూపల్లి రాము రావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక అప్‌గ్రేడ్ వెర్షన్‌లో ప్రేక్షకులకు మరింత వినోదాల విందును అందించనుంది ఆహా. ఆడియో, వీడియో పరంగా మరింత నాణ్యతతో కూడిన వరల్డ్ క్లాస్ ఫీచర్స్‌ను అందిచనున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.
గ్లోబెల్ రేంజ్‌లో ప్రతీసారి ఆహా వీక్షకుల కోసం ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతూ అందరి అంచనాలను మించేలా దూసుకెళ్తోంది. ఈ ఏడాది దీపావళికి ఆ ఎగ్జయిట్‌మెంట్‌ను రెట్టింపు చేసేలా పండుగ ఆనందాలను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఆహా యాప్‌ను 2.0గా అప్‌గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్‌తో వీక్షకులకు అందిస్తూ సంబరాలను తీసుకొచ్చింది ఆహా.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆహా ఇంత త్వరగా.. ఇంత సక్సెస్ అవుతుందని అసలు అనుకోలేదు. అందుకు కారణం ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులే. అందరికీ మా ధన్యవాదాలు. ఒక నెంబర్ వన్ తెలుగు ఓటీటీగా ఆహా ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘2019లో ఆహాను స్టార్ట్‌చేశాం. 2020 ఫిబ్రవరిలో అధికారికంగా స్టార్ట్ చేశాం. అప్పుడు మా మైండ్‌లో ఎన్నో అనుమానాలున్నాయి. అయితే జూపల్లి ఫ్యామిలీ నా వెనుకుండి నా విజన్ సపోర్ట్ చేశారు. వారిచ్చిన ధైర్యంతో ముందుకు వచ్చారు.
ఆహా ప్రమోటర్ రామ్ రావు జూపల్లి మాట్లాడుతూ ‘‘గత సంవత్సరం దీపావళికి ఆహా వేడుక చేసినప్పుడు ఏడాది పొడవునా తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్ అందిస్తామని ప్రామిస్ చేశాం. దాన్ని ఈరోజు మరో అడుగు ముందుకు తీసుకు వెళుతున్నాం. అందులో భాగంగానే ఆహా 2.0ను స్టార్ట్ చేశాం.
ఆహా సబ్ స్క్రైబర్స్ 199 దేశాల్లో ఉన్నారు. ఇంత కొద్ది సమయంలో మీ ప్రేమాభిమానాలు సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆహా గేమ్ చేంజర్ అయ్యింది. మా నాన్నగారు, ఈ సంస్థ చైన్మన్ రామేశ్వర్ రావుగారు మాపై నమ్మకంతో మాకు ఎంతో స్వేచ్ఛినిచ్చి ముందుకు నడిపించారు.
ఈ కార్యక్రమంలో ఆహా సీఈఒ అజిత్ ఠాకూర్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. తొలిసారి ఆహా అవార్డులను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా అందించారు.