మొన్నటికి మొన్న యష్ విషయంలో జరిగింది ఇప్పుడు ప్రభాస్ విషయంలోనూ రిపీట్ అయిందా.. అలా జరిగితే.. ఎలా అంటారా? యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే జరిగిందా? లేదా.?
అంటే.. కూసింత డిఫరెన్స్ కనిపిస్తోంది కానీ, అలాగే జరిగినట్టూ ఉంది... ఇంతకీ అలా ఎలా అంటారా.? కల్కి సినిమా జోష్ ఇంకా కంటిన్యూ అవుతోంది.
మా హీరో కాన్‌సెన్‌ట్రేట్ చేయనంతవరకే ఏదైనా... ఒక్కసారి దృష్టిపెట్టారా? చరిత్ర క్రియేట్ కావాల్సిందేనని హ్యాపీగా చెప్పుకుంటున్నారు డార్లింగ్ అభిమానులు.
యానిమల్ డైరక్టర్‌తో చేయబోయే స్పిరిట్ కోసం ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. యానిమల్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో క్రేజీ అటెన్షన్ తెచ్చుకున్న కెప్టెన్ సందీప్ రెడ్డి వంగా.
రీసెంట్‌గా స్పిరిట్ మూవీ కోసం కరీనాకపూర్‌ని అప్రోచ్ అయ్యారన్నది వైరల్ అయిన న్యూస్. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని ఓపెన్‌గా చెప్పేశారు కరీనాకపూర్.
పర్ఫెక్ట్ కేరక్టర్, కథ దొరికితే సౌత్ సినిమాలు చేయడానికి తనకేం ఇబ్బంది లేదని, ప్రభాస్ విషయంలో తననెవరూ అప్రోచ్ కాలేదని అన్నారు. నార్త్ భామలందరూ వరుసగా సౌత్ బాట పడుతుంటే,
కరీనా మాత్రం ఇంకా ఈ వైపు చూడటం లేదు. యష్ టాక్సిక్‌తోనే ఎంట్రీ ఇచ్చేస్తారని అందరూ ఎదురుచూసినా, ఆఖరి నిమిషంలో తూచ్ అనేశారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు తనను ఎవరూ అప్రోచ్ కాలేదన్నారు.
సో.. ఇప్పుడు ప్రభాస్, మొన్నటికి మొన్న యష్ మూవీస్‌తో వార్తల్లో అయితే ఉన్నారు కానీ, సైన్ చేయలేదన్నమాట కరీనా కపూర్.