Pan India Movies: ఇప్పటికి పాన్ ఇండియన్ లిస్టులో అడుగుపెట్టని హీరోలు..

| Edited By: Prudvi Battula

Jan 23, 2024 | 4:17 PM

పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. చిరంజీవి నుంచి ఇంద్రలో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన తేజ వరకు హీరోలెవర్ని కదిపినా పాన్ ఇండియా అంటున్నారు. మరి అందరి చూపు అటువైపే ఉంటే.. మన రీజినల్ సినిమాలు చేసేదెవరు..? ఇప్పటికీ తెలుగు మార్కెట్‌పైనే ఫోకస్ చేస్తున్న హీరోలెవరు..? పాన్ ఇండియన్ వైపు చూడని కథానాయకులెవరు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్..

1 / 5

2 / 5
రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా అనే మాటనే మరిచిపోతున్నారు మన హీరోలు. ఎవర్ని కదిపినా కూడా పాన్ ఇండియా అంటున్నారు. తెలుగు మార్కెట్‌తో ఏ హీరో కూడా ఆనందంగా ఉన్నట్లు కనిపించట్లేదు. స్టార్స్‌లో మహేష్ బాబు మాత్రమే పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈయన కూడా జక్కన్న సినిమాతోనే అన్ని ఇండస్ట్రీలు కవర్ చేయాలని చూస్తున్నారు.

3 / 5
పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియన్ సినిమా ఇప్పటివరకు చేయలేదు. ఈయన కేవలం తెలుగుపైనే ఫోకస్ చేస్తున్నారు. అయితే రాజకీయాల కారణంగా పవన్‌ను రెగ్యులర్ హీరోలా ట్రీట్ చేయడమే మానేసారు అభిమానులు. ఆయన సినిమా చేస్తే చాలు.. అది పాన్ ఇండియానా కాదా అని కూడా పట్టించుకోవట్లేదు. అయితే ఆయన కూడా ఓజితో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇస్తున్నారు.

4 / 5
సీనియర్ హీరోలలో చిరంజీవి, నాగార్జున ఇప్పటికే పాన్ ఇండియన్ సినిమాలు చేసారు.. చేస్తున్నారు కూడా. వెంకటేష్ కూడా కిసీ కా భాయ్ కిసీ కా జాన్, రానానాయుడుతో హిందీలో ట్రై చేసారు. బాలయ్య మాత్రమే సీనియర్లలో పాన్ ఇండియాకు దూరంగా ఉన్నారు. టైమ్ వచ్చినపుడు NBK సైతం రెచ్చిపోవాలని చూస్తున్నారు.

5 / 5
వీళ్లు మినహాయిస్తే ప్రతీ హీరో చూపు పాన్ ఇండియాపైనే ఉంది. అయితే ప్రభాస్ ఒక్కడే ఇప్పటి వరకు హిందీలో సాలిడ్ మార్కెట్ తెచ్చుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ రేంజ్ వాళ్ల నెక్ట్స్ మూవీస్ విడుదలయ్యాక తెలుస్తుంది. రామ్, రవితేజ, విజయ్ దేవరకొండ వీళ్లు కూడా పాన్ ఇండియాకు ట్రై చేస్తున్నా.. ఎప్పుడు సక్సెస్ అవుతారో చూడాలి.