Ram Charan: మళ్లీ డిస్సపాయింట్.! పాపం.. చిరంజీవి, పవన్ మధ్య నలిగిపోతున్న రామ్ చరణ్.
ఇటు చూస్తే నాన్న.. అటు చూస్తే బాబాయ్.. ఎవరికీ ఎదురెళ్లలేడు.. అలాగని ఇద్దరికీ నో చెప్పలేడు.. పాపం అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నారు రామ్ చరణ్. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవడం మెగా వారసుడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. చిరంజీవి, పవన్ మధ్య నలిగిపోతున్న గేమ్ ఛేంజర్ అసలు 2024లో వస్తుందా..? అందరు సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అవుతున్నాయి.. కానీ గేమ్ ఛేంజర్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది.