Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు కామెడీ సిరీస్.. సోషల్ మీడియా తెగ ట్రెండ్ అవుతున్న క్రేజీ మూవీ..

Updated on: Oct 12, 2026 | 8:43 PM

ప్రముఖ నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' డిజిటల్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఈటీవీ విన్‌ , నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి దూసుకెళ్తోంది. నేటి తరం యువకులు ఎదుర్కొంటున్న పెళ్లి చూపుల కష్టాలు, సిటీ లైఫ్‌లో బ్యాచిలర్ ఎదుర్కొనే ఛాలెంజెస్‌ను సహజంగా చూపించారు.

1 / 5
తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న సిరీస్‌లు రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' డిజిటల్ రంగంలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.

2 / 5
ప్రముఖ హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన ఈ 6 ఎపిసోడ్‌ల మినీ సిరీస్, ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఈటీవీ విన్'తో పాటు గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్'లో ఏకకాలంలో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఏకంగా 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి అరుదైన రికార్డును నమోదు చేసింది.

3 / 5
పెళ్లి మార్కెట్లో యువకులు ఎదుర్కొనే వాస్తవిక ఇబ్బందులు , సరదా సన్నివేశాల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. పల్నాడు ప్రాంతానికి చెందిన తేజ (హర్ష చెముడు) అనే అమాయక యువకుడు, తన లుక్స్ కారణంగా పెళ్లి చూపుల్లో రిజెక్షన్లు ఎదుర్కొంటూ ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. అక్కడ అతనికి ఆఫీస్‌లో ఎదురయ్యే ఊహించని పరిణామాలు, తన టీమ్ లీడ్ మధు (ఐశ్వర్య హోలక్కల్) తో ఏర్పడే లివ్-ఇన్ ఒప్పందం వంటి ఆసక్తికర మలుపులతో ఈ కథ నడుస్తుంది.

4 / 5
హర్ష చెముడు తనదైన సెటిల్డ్ యాక్టింగ్ , సహజమైన కామెడీ టైమింగ్‌తో సిరీస్‌ను ముందుండి నడిపించారు. ఆయనతో పాటు ఐశ్వర్య హోలక్కల్ నటన ఆకట్టుకోగా, హైపర్ ఆది, శ్రీవిద్య , జీవన్ కుమార్ తమదైన పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. రొటీన్ ఫార్ములా అయినప్పటికీ, ఎంటర్‌టైనింగ్ స్క్రీన్‌ప్లే కారణంగా వీకెండ్ బింజ్ వాచ్ చేయడానికి ఈ సిరీస్ యూత్‌కు చక్కటి ఆప్షన్‌గా నిలిచింది.Eligible Bachiler Mov

5 / 5
యూట్యూబ్ కామెడీ వీడియోలతో 'వైవా హర్ష'గా పాపులర్ అయిన హర్ష చెముడు, సహాయ నటుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 'సుందరం మాస్టర్' చిత్రంతో హీరోగా మారిన హర్ష, ఈ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సిరీస్‌లో పూర్తి స్థాయి లీడ్ రోల్‌లో నటించి తన కామెడీ టైమింగ్‌తో పాటు సీరియస్ ఎమోషన్లను కూడా అద్భుతంగా పండించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us