
అపర కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. ముంబైలోని ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అలాగే సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సందడి చేశారు. ప్రస్తుతం అంబానీ ఇంట జరిగిన గణేశ్ చతుర్థి వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ముకేష్ అంబానీ, నీతా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్ తదితరులు వినాయకుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు, ఆభరణాల్లో ధగాధగా అందరూ మెరిసిపోయారు. ఈ సందర్భంగా తోడికోడళ్లతో నీతా అంబానీ దిగిన ఫోటోలు నెట్టింట వైరలవుతన్నాయి.

షారూఖ్ ఖాన్- గౌరీఖాన్, రణ్‌వీర్ సింగ్- దీపికా పదుకొణె, సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ, సచిన్ టెండూల్కర్- అంజలి, కేఎల్ రాహుల్- అతియా, నయనతార- విఘ్నేష్ శివన్, జహీర్‌ఖాన్-సాగరిక ఘట్టే, జెనీలియా- రితేష్ దేశ్‌ము గణేష్ చతుర్థి వేడుకలకు సతీసమేతంగా హాజరయ్యారు.

అలాగే సల్మాన్ ఖాన్, అలియాభట్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య, రష్మిక మందన్నా, దిశా పటానీ, ఊర్వశి రౌతెలా, హేమా మాలిని, అనిల్ కపూర్, కరణ్ జోహార్, బొమన్ ఇరానీ, సీనియర్ నటి రేఖ తదితరులు కూడా ఈ గణేష్ చతుర్థి వేడుకల్లో తళుక్కుమన్నారు.

అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి, ఏక్తా కపూర్, నీల్ నితేష్ దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్రెడిషినల్ లుక్‌లో కనిపించారు.

ప్రస్తుతం ఈ స్టార్ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అంబానీ ఫ్యామిలీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.