Basha Shek |
Apr 28, 2024 | 10:40 PM
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. త్వరలోనే అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మన ముందుకు వస్తోందీ హైదరాబాదీ బ్యూటీ
జాతిరత్నాలు తర్వాత రావణాసుర సినిమాలో స్పెషల్ రోల్ లో సందడి చేసింది ఫరియా. అలాగే బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.
ఫరియా, అబ్దుల్లా జంటగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది. మే 3న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ప్రమోషన్లలో భాగంగా పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది ఫరియా. 30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఖరాఖండిగా చెప్పేసింది.
అది కూడా ప్రేమ వివాహమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చిందీ అందాల తార. అయితే ఆ ప్రేమికుడు మాత్రం ఎవరో చెప్పలేదు ఫరియా. ప్రస్తుతం తన దృష్టంతా సినిమా కెరీర్‌పైనే ఉందంటోంది.