శంకర్ నెక్ట్స్ సినిమా ఏంటి..? అదేంటి ఇంకా గేమ్ ఛేంజర్ విడుదలే కాలేదు.. ఇండియన్ 3 కూడా లైన్‌లోనే ఉంది. అప్పుడే నెక్ట్స్ సినిమా గురించి ఎందుకు.. ముందు ఇవి విడుదల కానివ్వండి అనుకుంటున్నారు కదా..! కానీ ప్లానింగ్‌లో పిహెచ్‌డీ చేసిన శంకర్ ఊరుకుంటారా చెప్పండి..? అందుకే అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌పై వర్క్ మొదలుపెట్టేసారు.
శంకర్ ఫోకస్ అంతా ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌పైనే ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు శంకర్. కొన్నేళ్లుగా ఈయనకు సరైన సినిమా పడలేదు. ఇంకా చెప్పాలంటే 2010లో వచ్చిన రోబో తర్వాత ఆ రేంజ్ సక్సెస్ శంకర్‌కు రాలేదు. ఐ, 2.0, ఇండియన్ 2 కమర్షియల్‌గా నిరాశ పరిచాయి.
ఇతర సినిమాల ఫంక్షన్స్‌లో కనిపించినా... మహేష్ మూవీ గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు రాజమౌళి. గేమ్ చేంజర్ వేదిక మీద ఎస్ఎస్ఎంబీ 29 ప్రస్తావన వచ్చినా... ఏ మాత్రం క్లూ ఇవ్వలేదు. షూటింగ్ టైమ్ లైన్స్ విషయంలోనూ ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.
గేమ్ ఛేంజర్ హిట్టైతే ఇండియన్ 3కి మళ్లీ ఊపొస్తుంది. అదే జరగాలని కోరుకుంటున్నారు శంకర్ కూడా. ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో.. పార్ట్ 3పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. దీని తర్వాత ప్రాజెక్ట్‌కు ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు శంకర్. వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా 3 భాగాలతో శంకర్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది
నిజానికి వీరయుగ నాయగన్ వేల్పరి అనేది శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను శంకర్ కూడా కన్ఫర్మ్ చేసారు. గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్‌లో సాయం చేసిన మధురై ఎంపి వెంకటేశన్ రాసిన నవలలో వేల్పరి నేపథ్యం ఉంది. దీన్ని కూడా తన సినిమా కోసం వాడుకోబోతున్నారు శంకర్. గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఆడితే.. శంకర్ నుంచి ఈ 3 పార్ట్స్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.