
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో స్టార్‌గా మారింది. ఇప్పుడు తన బాల్య చిత్రాలను పంచుకుంది. సినిమాలతో పాటు, ఈ నటి రాజకీయ రంగంలో కూడా చురుకుగా ఉంటుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఖుష్బు. ముంబైలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె 1980లలో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించింది. ఖుష్బు తొలి చిత్రం 'తోడిసి బేవాఫాయి'. నసీబ్, లావారిస్, కాలియా వంటి అమితాబ్ బచ్చన్ చిత్రాలలో ఖుష్బు బాలనటిగా కూడా కనిపించింది.

ఖుష్బు హీరోయిన్‌గా కూడా మెరిసింది. ఖుష్బు నేటి దక్షిణ భారత సినిమాల్లోని ప్రముఖ నటీమణులలో ఒకరు. ఖుష్బు 2010లో రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. వెంకటేశ్ నటించిన కలియుగ పాండవులు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది.

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో చిరు చెల్లిగా కనిపించింది. ప్రస్తుతం సహయ నటిగా కొనసాగుతుంది. దర్శకుడు సుందర్‌ను వివాహం చేసుకుంది. ఖుష్బు వివాహం తర్వాత హిందూ మతంలోకి మారారు.

ఖుష్బు 100 కి పైగా చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించిన నటి. రజనీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, ప్రభు, సురేష్ గోపి, మోహన్ లాల్, మమ్ముట్టి, జయరామ్ వంటి నటులతో కలిసి నటించింది. ఖుష్బు అభిమానులు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఆమె కోసం ఒక గుడి కట్టారు.