
సాయిపల్లవి.. ప్రేమమ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. సాయిపల్లవి జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీ నుండి MBBS డిగ్రీని పొందింది. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత నటించడం ప్రారంభించింది.

డైరెక్టర్ శంకర్ చిన్న కుమార్తె అదితి శంకర్ విరుమన్ చిత్రంలో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆమె చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది. ఇటు బైరవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.

ఐశ్వర్య లక్ష్మి.. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె 2017లో ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది.

శ్రీలీల టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇప్పుడు తమిళంపై ఫోకస్ పెట్టింది ఈ అమ్మడు. పెళ్లి సందడి సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు దక్షిణాదిలో బిజీ హీరోయిన్. శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతూనే సినీరంగంలోకి అడుగుపెట్టింది.

మా ఊరి పొలిమేర, పొలిమేర 2 వంటి సినిమాలతో నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్న ఈ అమ్మడు.. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేసింది. ఇప్పుడు నటిగా ప్రశంసలు అందుకుంటుంది.