
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పాపులర్ అయిన హీరోయిన్ శ్రీలీల. అందం, అభినయంతోపాటు అదృష్టం కలిసి వచ్చిన హీరోయిన్. తెలుగులో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోలతోనూ జతకట్టి హిట్స్ అందుకుంది.

గతేడాది మూడు సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. నితిన్ సరసన రాబిన్ హుడ్, కిరీటి జోడిగా జూనియర్, రవితేజ సరసన మజాకా సినిమాల్లో నటించింది. కానీ ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఇటీవలే పరాశక్తి సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో అక్కడ కూడా ఈ బ్యూటీకి మరోసారి నిరాశే ఎదురయ్యింది. పరాశక్తి సినిమాతో తమిళంలో ఈ బ్యూటీ పాగా వేస్తుందని భావించారు. కానీ ఆమెకు తమిళంలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ కాలేదు.

ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైందట. ఆ సినిమా మరేదో కాదు.. అనగనగా ఒకరాజు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

కేవలం ఐదు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాకు ముందుగా శ్రీలీలను ఎంపిక చేసుకున్నారట. మీనాక్షి కంటే ముందు శ్రీలీలను అనుకున్నారట. కానీ ప్రాజెక్ట్ డీలే కావడం.. ఇతర సినిమాలు ఉండడంతో శ్రీలీల తప్పుకుందని.. దీంతో ఆ ఛాన్స్ మీనాక్షికి వచ్చిందట.