
సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది ఓ అందాల భామ. అతన అందంతో కుర్రకారును కట్టిపడేసిన ఆమె సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు, వీడియోలతో నెటిజన్స్ మతిపోగొడుతోంది. పై ఫొటోలో దెయ్యంగా మారిన ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. ఇక ఆమె నటించిన ఓ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందం, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రయోగాత్మక చిత్రాలతో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ ఆమెకు సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చురుగ్గా ఉంటుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఆదా శర్మ. ఈ అమ్మడు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నితిన్ కాంబోలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ యూత్ హార్ట్స్ దొచేసింది ఆదా శర్మ. ఫస్ట్ మూవీతోనే యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ వయ్యారికి వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అదా.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడే ది కేరళ స్టోరీ అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. కానీ విడుదలకు ముందే ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అదాకు అంతగా ఆఫర్స్ రాలేదు. హిందీలో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది అదా శర్మ. ప్రస్తుతం సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అదా శర్మ.. ఇప్పుడు ఇన్ స్టాలో సందడి చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు ఓల్డ్ వీడియో వైరల్ అవుతుంది. అందులో దెయ్యంలా మారిపోయి కనిపించింది. నేను నా నెక్ట్స్ ప్రాజెక్ట్ గా హారర్ సినిమాకు సైన్ చేయాలా ? అంటూ తన అభిమానులను అడుగుతూ గతంలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో అదా శర్మ వీడియోకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేవు .