
కాలేజీ రోజుల్లో అందంగా లేదంటూ విమర్శించారు. దీంతో ఆమె ఆత్మ విశ్వాసం దెబ్బతిందట. నలుగురిలో కలవడానికి ఎంతో ఇబ్బందిపడేదట. కానీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఒక్క ఫోటో ఆమె కెరీర్ మార్చేసింది. తన గురించి పాజిటివ్ కామెంట్స్ రావడం చూసి ఆశ్చర్యపోయిందట.

కట్ చేస్తే.. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. ఫస్ట్ మూవీలోనే గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తొలి చిత్రంలోనే రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.

ఆమె మరెవరో కాదు.. దివ్య భారతి. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా చేసిన బ్యాచిలర్ అనే సినిమా సినీరంగంలోకి కథానాయికగా అడగుపెట్టింది. ఈ సినిమాతో దివ్య భారతి పేరు ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.

అయితే బ్యాచిలర్ సినిమా తర్వాత ఆమె నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. తమిళంలో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఇప్పుడు తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కేవలం ఈ ఒక్క సినిమాలోనే నటిస్తుంది. మరోవైపు సోషళ్ మీడియాలో మాత్రం నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.