
యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ చాలా తక్కువ సమయమే అయినప్పటికీ ఈ బ్యూటీ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంలో నటించ, టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిది ఈ చిన్నది. ఈ మూవీ అంతగా హిట్ అందుకోకపోయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత వరసగా సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసింది.

ఈ అమ్మడు నాగార్జున సరస నా సామి రంగ మూవీలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇ ఈ సంక్రాంతి పండుగకు భర్త మహాశయులకు అనే సినిమా ద్వారా థియేటర్లో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ నెట్టింట తన అందాలతో హల్ చల్ చేస్తుంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తన క్యూట్ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరి మనసు దోచేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ లంగావోణీలో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ లైట్ పీచు కలర్ లెహెంగాలో దిగిన ఫొటోస్ షేర్ చేసింది. ఇక ఆ ఫొటోస్ చూస్తే పండగ వాతావరణం నీలోనే కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.