
సిల్క్ స్మితతో ఉన్న తన రిలేషన్ గురించి టాలీవుడ్ నటుడు బాబు మోహన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఒకానొక సందర్భంలో సిల్క్ స్మిత తనను ఆమెతో పాటు షాపింగ్‌కు రావాలని పట్టుబట్టిందన్నారు. మొదట ఆయన వెళ్ళడానికి సంశయించినా, ఆమె పర్మిషన్ తీసుకున్నానని చెప్పడంతో ఒప్పుకున్నారు. షాపింగ్‌లో సిల్క్ స్మిత పలు వస్తువులు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆమె ఒక నల్ల కళ్లద్దాలను ట్రై చేసి, బాబు మోహన్‌ను అభిప్రాయం అడిగింది.

బాబు మోహన్ ఆ కళ్లద్దాలు చాలా బాగున్నాయని చెప్పగా, నిజంగా బాగున్నాయా? అయితే కొనేస్తున్నాను అని సిల్క్ స్మిత చెప్పిందట. ఆమె ఆ కళ్లద్దాలను కొనుగోలు చేసి, బాబు మోహన్ వైపు చూపిస్తూ ఇది మీరు పెట్టుకోండి బాస్, ఇది మీకు చాలా బాగుంటుంది. మీ కోసమే కొన్నాను అని పేర్కొంది. సిల్క్ స్మిత ఇచ్చిన ఆ కళ్లద్దాలను బాబు మోహన్ అమూల్యమైన జ్ఞాపకంగా భావించి, ఆమె మరణించేంత వరకు ఆ బహుమతిని జాగ్రత్తగా దాచుకున్నారట.

ఇదిలా ఉంటే.. సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. ఇటీవల బాబు మోహన్ దీనిపై కూడా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక షూటింగ్ పూర్తయిన తర్వాత సిల్క్ స్మిత ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించిందట. "మీ ఇల్లు అక్కడే. నేను మీరు ఉన్నారని వచ్చాను. షాట్ అయినాక మన ఇంటికి వెళ్దాము," అని ఆమె ఆప్యాయంగా చెప్పిందట.

బాబు మోహన్‌ను తన చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్లింది సిల్క్ స్మిత. ఆమె ఇంటిని అద్భుతంగా అలంకరించిన తీరు ఆయనను ఆశ్చర్యపరిచింది. మెట్ల దగ్గర నుంచి ఎంట్రన్స్ వరకు, ఒక పెక్యులర్ డ్రెస్ వేసిన పెద్ద కుండలను అలంకరించి, బొమ్మల మాదిరిగా ఏర్పాటు చేసింది. ఇల్లంతా షూటింగ్ కోసం డెకరేట్ చేసిన బొమ్మరిల్లులా కనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.

"ఇదంతా నేనే చేశాను. బాగుందా బాస్?" అని అడిగి, ఇల్లంతా చూపించి, కాఫీ ఇచ్చి బాబు మోహన్‌కు సిల్క్ స్మిత ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత, షిఫ్టింగ్ కోసం పిలుపు రావడంతో బాబు మోహన్ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సంఘటన జరిగిన కేవలం ఒకటి లేదా రెండు నెలల్లోనే సిల్క్ స్మిత మరణించినట్లు బాబు మోహన్ పేర్కొన్నారు. అతడే "చంపేసిండు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తనతో చాలా అద్భుతంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు.