ఛీ.. ఛీ ఈ హీరోలతోనా నేను సినిమాలు చేసింది.. తలుచుకుంటేనే అసహ్యం వేసింది

Updated on: May 16, 2026 | 8:24 PM

టాలీవుడ్ హీరోయిన్ విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ, సినీ రంగ ప్రస్థానం గురించి అలాగే సినిమాల గురించి వివరంగా పంచుకున్నారు. ప్రజలకు నిరంతరం సేవ చేయడమే తన జీవిత ఆశయమని, 24 గంటలు పనిచేయడం తనకెంతో అలవాటని ఆమె స్పష్టం చేశారు.

1 / 5
విజయశాంతి ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. చాలా కాలం ఇండస్ట్రీలో రాణించిన విజయశాంతి ఆతర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు విజయశాంతి.. ఆతర్వాత రాజకీయాల్లో రాణించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాల్లో నటిస్తున్నారు విజయశాంతి. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లోని కొందరు హీరోల ప్రవర్తన, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న వ్యక్తిగత సవాళ్లను నిర్మొహమాటంగా పంచుకున్నారు. పరిశ్రమలో కొంతమంది హీరోలు తెరపై కనిపించే విధంగా కాకుండా, నిజ జీవితంలో భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉంటారని, వారి నిజస్వరూపం తెలిసినప్పుడు తన పట్ల గౌరవం సన్నగిల్లి, అసహ్యం పుడుతుందని ఆమె వివరించారు.

2 / 5
అయితే, ఇది అందరు హీరోల విషయంలో కాదని, ఒకటి లేదా ఇద్దరు టాప్ హీరోల విషయంలో ఈ అనుభవం ఎదురైందని ఆమె స్పష్టం చేశారు. వారి పక్కన ఇన్ని సంవత్సరాలు నటించామా అని అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళగా సినీ రంగంలో యాక్షన్ సన్నివేశాలు చేసి రాణించడం అరుదైన అవకాశం అని విజయశాంతి పేర్కొన్నారు. తనకు అటువంటి అవకాశం లభించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డారని ఆమె తెలిపారు. ఈ క్రమంలో ఎన్నో శారీరక, మానసిక కష్టాలను ఎదుర్కొన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు.

3 / 5
సాహసబాలుడు విచిత్ర కోతి వంటి చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో ఆమె కుడి కాలు పూర్తిగా విరిగిపోయిందని తెలిపారు. కాలు విరిగిపోయినా, దాని గురించి ఎవరికీ తెలియకుండా, భరించలేని నొప్పిని తట్టుకుంటూ.., గుడ్డ కట్టుకొని నాలుగు రోజుల పాటు ఒక్క కాలుపై నిలబడి షూటింగ్ పూర్తి చేశారని ఆమె తెలిపారు. సినిమాలో హీరోలు గాయపడినా పోరాడే సన్నివేశాల మాదిరిగానే తన నిజ జీవితంలో కూడా ఇది జరిగిందని ఆమె వివరించారు. ఈ అసాధారణమైన పోరాట పటిమ వెనుక తన వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలు ఉన్నాయని విజయశాంతి పంచుకున్నారు.

4 / 5
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల తన గుండె రాయిగా మారిందని, మొండిదాన్నైపోయాను అని ఆమె అన్నారు. జీవితం అంటే కష్టాలు వస్తాయి, వాటిని తట్టుకోవాలని ఆ పరిస్థితి తనకు నేర్పించిందని తెలిపారు. నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో, తన బాధను పక్కన పెట్టి పనిచేశానని, షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆపరేషన్ చేయించుకున్నానని పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత కేవలం వారం రోజుల్లోనే తిరిగి షూటింగ్‌కు హాజరైనట్లు ఆమె వెల్లడించారు. అలాంటి కష్టాలు వేరే ఏ హీరోయిన్ అయినా ఎదుర్కొని ఉండేవారు కాదని, బహుశా పారిపోయేవారని ఆమె అభిప్రాయపడ్డారు.

5 / 5
సినిమా రంగంలోకి వచ్చిన మొదటి ఐదేళ్లు తాను సున్నితంగా ఉన్నానని, ఆ తర్వాత పూర్తిగా మరో విజయశాంతిగా మారిపోయానని ఆమె అన్నారు. పాత చిత్రాలలో తాను కనిపించిన విధంగా ఇప్పుడు తన సున్నితత్వం లేదని ఆమె స్పష్టం చేశారు. తన కెరీర్ విజయానికి దైవానుగ్రహం, శివుడి భక్తురాలిగా ఆ శక్తి తనకు అండగా నిలవడం, అలాగే ప్రజల నిరంతర ఆదరణే కారణమని విజయశాంతి తెలిపారు. 

Follow Us