
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ అమ్మడు.

ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ రాణిస్తుంది ఈ అమ్మడు. నేచురల్ బ్యూటీగా ఈ చిన్నది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక సాయి పల్లవి తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది. సాయి పల్లవి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే .. ఆమెకోసమే సినిమాలు చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు.

ఇక సాయి పల్లవి పాత్ర కోసం చాలా కష్టపడుతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకోవడమే కాదు. ఆ పాత్రలకు జీవం పోస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సాయి పల్లవి పెళ్లి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని తెలిపింది.

సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ రెండేళ్ల ముందే పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి హిందీ రామాయణం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. సాయి పల్లవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.