
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ నేషనల్ క్రష్‌గా మారిన కథానాయిక రుక్మిణి వసంత్. కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బెంగుళూరు భామ, తక్కువ సమయంలోనే తన అందం, అద్భుతమైన అభినయంతో విశేష గుర్తింపు తెచ్చుకుంది. రక్షిత్ శెట్టి సరసన నటించిన 'సప్త సాగరదాచే ఎల్లో' (తెలుగులో 'సప్త సాగరాలు దాటి') చిత్రంలో ప్రియ పాత్రతో ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుని సౌత్ ఇండియా మొత్తం మార్మోగిపోయే క్రేజ్ సంపాదించుకుంది.

ఇటీవల కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం 'కాంతార చాప్టర్ 1' లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది రుక్మిణి. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస భారీ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్'లో నటిస్తూ టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.

ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్ ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. "తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఎవరితో కలసి జోడీ కట్టాలని ఉంది?" అని ప్రశ్నించగా.. రుక్మిణి ఏమాత్రం సందేహించకుండా తన మనసులోని మాటను బయటపెట్టారు.

తెలుగులో తనకు న్యాచురల్ స్టార్ నాని అంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. నాని నటన చాలా సహజంగా ఉంటుందని, ఆయన చేసే వైవిధ్యమైన పాత్రలు, పండించే భావోద్వేగాలు తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు. ఆయన సరసన ఒక్క సినిమాలోనైనా నటించి స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది తన కోరిక అని రుక్మిణి వసంత్ తెలిపారు. ప్రస్తుతం రుక్మిణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

తాజాగా రుక్మిణి వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో నాని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాచురల్ స్టార్ నాని, రుక్మిణి వసంత్ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడటానికి అద్భుతంగా ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వరుస పాన్ ఇండియా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ కన్నడ బ్యూటీ త్వరలోనే తన డ్రీమ్ హీరో సరసన నటించే అవకాశం అందుకోవాలని కోరుకుంటున్నారు.