
రితిక నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతున్న హీరోయిన్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు. నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో

మిరాయ్ చిత్రంలో మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో రాబోతున్న కొరియన్ డ్యాక్ డ్రాప్ హారర్ కామెడీ మూవీలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

అలాగే గోపిచంద్ 33వ సినిమాలోనూ ఈ బ్యూటీ కనిపించనుందని టాక్. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.ఏడో శతాబ్దంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతుంది హీరోయిన్ రితికా నాయక్. ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది. ఈ అమ్మడుకు మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమని తెలుస్తోంది.