Pooja Hegde: స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడనున్న పూజా హెగ్డే.. !! అతనెవరంటే..
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డేకు ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయి. నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూజా. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. తక్కువ సమయంలోనే పూజా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ చిన్నది. అయితే గతకొంతకాలంగా ఈ అమ్మడుకి అదృష్టం కలిసి రావడం లేదు. చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి.