
చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు సినిమాల్లో ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి ఆతర్వాత హీరో, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఈ అమ్మడు చాలా మంది అభిమాన హీరోయిన్.

చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది కావ్య కళ్యాణ్ రామ్.

మసూద సినిమాలో ఆమె రోల్ పెద్దగా ఉండదు. ఆతర్వాత బలగం సినిమాతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగింది. బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో కావ్య చాలా మంది ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆతర్వాత ఉస్తాద్ అనే సినిమా చేసింది.

శ్రీ సింహ నటించిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అసలు ఆ సినిమా వచ్చి పోయింది కూడా చాలా మందికి తెలియదు. ఆ సినిమా తర్వాత కావ్య సైలెంట్ అయ్యింది. ఆఫర్స్ రావడం లేదో లేక ఆమే సినిమాలు కావాలని గ్యాప్ ఇచ్చిందో తెలియదు కానీ సినిమాలకు దూరంగా ఉంటుంది.

సినిమాలకు దూరంగా ఉంటున్న సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాల యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలై ఇప్పుడు వైరల్ గా మారాయి.