
మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ ముద్దుగుమ్మ అనంతిక సనీల్ కుమార్. మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. జూన్ 20న ఈ సినిమా విడుదలకాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది.

అనంతిక మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇంటిమేట్ సీన్స్ చేయలేదు. అలాంటి సన్నివేశాల్లో నటించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలా అని అలాంటి పాత్రను చేయను అని చెప్పట్లేదు. కథ డిమాండ్ చేస్తే ఇంటిమేట్ సీన్స్ చేయడానికి నాకు ఇబ్బందిలేదు. అప్పుడు కొంత లిమిటేషన్ ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి లేదని.. చిన్నప్పటి నుంచే డ్యాన్స్, కరాటే నేర్చుకున్నానని తెలిపింది. సినిమాల్లోకి వచ్చేందుకు వీటిని నేర్చుకోలేదని.. కానీ అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపింది. కోవిడ్ టైంలో ఖాళీగా ఉండడంతో ఓ మలయాళీ సినిమాలోకి డ్యాన్సర్ గా వెళ్లడంతో అక్కడ డీఓపీ తనను చూసి హీరోయిన్ గా ట్రై చేయాలని సూచించాడని తెలిపింది.

అప్పటి నుంచి సినిమాలకు అడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశానని.. మంచి సందేసం ఇచ్చే సినిమాలను చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నానని.. నటిగా కొనసాగాలని తనకు లేదని.. ప్రస్తుతం లా చేస్తున్నానని.. 40 ఏళ్ల వయసు వచ్చాకా రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం 8 వసంతాలు సినిమాలో నటిస్తుంది అనంతిక. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన క్రేజీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అలాగే తెలుగులో ఈ అమ్మడు మరిన్ని అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.