
చామంతి మొక్కలు అందరి ఇళ్లలో ఉంటాయి. అయితే, ఇవి ఒక్కోసారి సరిగా పూయవు. మరి కొందరి ఇళ్ళలో గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇదొక్కటి పోస్తే మొక్క గుబురుగా పెరిగి.. చామంతి పూలు గుత్తులు గుత్తులుగా వేలల్లో పూస్తాయి. పూలు బాగా పూయలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో లేట్ చేయకుండా ఇక్కడ చూద్దాం..

ఆవపిండి : వంద గ్రాముల ఆవపిండిని ఒక లీటరు నీటిలో వేసి 3 నుండి 4 రోజుల పాటు వీటిని పులియబెట్టండి. నాలుగు రోజుల తర్వాత, ఆ ద్రావణాన్ని బాగా కలిపి, దానికి మరో 5 లీటర్ల కలిపి నీటిని తీసుకోవాలి. మీరు దీనిని 20 రోజులకొకసారి మొక్క మొదట్లో దీనిని పోస్తూ పోయాలి. దీని వలన గుబురుగా పెరిగేలా చేస్తుంది.

కొమ్మల చివర్లను వేళ్లతో తుంచాలి : ఈ మొక్క పెరిగే దశలో కొమ్మల చివర్లను వేళ్లతో తుంచాలి. ఇలా చేయడం వలన పక్క నుంచి కొత్త కొమ్మలు వస్తాయి. ఈ మొక్క గుబురుగా మారుతుంది.ఇంకా ఈ కొమ్మలు ఎక్కువైతే పూలు కూడా వేలల్లో అధికంగా పూస్తాయి. ఈ మొక్కకు నత్రజని, ఫాస్పరస్, పొటాషియంను తీసుకోవాలి.

కొత్త మొగ్గలు వస్తాయి: మీరు చామంతి మొక్కకు రోజుకు 5 నుంచి 6 గంటల పాటు ఎండ తగిలేలా చేయాలి. అలాగే వాడిపోయిన పూలను తీసి పక్కనే వేయండి . ఇంకా పూలు వాడిపోయిన వెంటనే వాటిని కత్తిరించడం వల్ల మొక్క వృథా కాకుండా కొత్త మొగ్గలు రావడానికి ఉపయోగపడుతుంది.

నీరు క్రమంగా పెట్టాలి: ఈ మొక్క చుట్టూ తేమగా ఉండేలా చూసుకోవాలి. కానీ, నీరు నిలబడకుండా చూసుకోవాలి. తేమ ఆరిపోతే నీరు పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే చామంతి పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. నెలకొకసారి ఒక లీటరు నీటిలో ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కలిపి ఈ మొక్కపై స్ప్రే చేస్తే ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా ఉంటాయి.