
చింత చిగురు పచ్చి రొయ్యలు కూరకి కావాల్సిన పదార్దాలు : కేజీ పచ్చి రొయ్యలు, 200 గ్రాముల చింత చిగురు, రెండు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, కట్ట కొత్తిమీర, ఒక కప్పు చింతపండు రసం, అర కప్పు నూనెను తీసుకోవాలి.

పచ్చి రొయ్యలను ఇలా ఉడికించుకోవాలి : ముందుగా పచ్చి రొయ్యలను తీసుకుని ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసి దానిలో ఉన్న నల్ల దారాన్ని తీసివేయండి.ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింత చిగురును తీసుకుని దానిని కడిగి ఒక గిన్నెలో పెట్టీకోవాలి. మట్టి పోయే వరకు దీనిని ఆలాగే కడుగుతూ ఉండాలి.

అయితే, వీటిని మరి మెత్తగా కాకుండా గట్టిగా ఉడకబెట్టాలి. ఇలా చేస్తే తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, అది బాగా వేడయ్యాక దానిలో రొయ్యలు వేసి 15 నిమిషాల పాటు వేయించాలి. అలా ఉడికించకండి లేదంటే అవి గట్టిగా అవుతాయి. మరి మెత్తగా వద్దు లైట్‌గా వేపి ఒక దానిలో గిన్నె లేదా ప్లేట్ లో పెట్టుకోవాలి.

మళ్ళీ ఇంకో పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక కరివేపాకు ఆకులు , కట్ చేసిన పచ్చిమిర్చి కూడా దీనిలో వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు కలర్లోకి మారే వరకు వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఆలాగే కుక్ చేయాలి. ఆ తర్వాత దీనిలో టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి.

ఇప్పుడు ఈ మసాలాలో చింత చిగురు, అర టేబుల్ పసుపు,ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ గరం పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి వీటిని బాగా కలపాలి. చింత చిగురు బాగా ఉడికే వరకు మూతపెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. వీటిని మసాలా కలుపుకోవాలి. చివర్లో రొయ్యలు, చింతపండు రసం వేసి మీడియం సన్నని మంట పై 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి