
చింత చిగురు చేపల పులుసు వినడానికి కొత్తగా ఉన్నా చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దానికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

స్టెప్ - 1: ముందుగా చేప ముక్కలను తీసుకుని ఉప్పుతో బాగా కడిగి శుభ్ర పరచుకోవాలి. కడిగిన తర్వాత ఇంకా వాసన వస్తే పసుపు, ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోండి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ఉప్పు, కారం మసాలాలు పట్టించి పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ - 2: ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు దోరగా వేయించాలి.

స్టెప్ - 3: ఇప్పుడు చేప ముక్కలను తీసుకుని, దానిలో కొద్దిగా నీళ్ళు పోసి, చింతచిగురును కూడా వేసి, మూత పెట్టి సన్నటి మంటపై ఉడికించాలి. చేప ముక్కలు మెత్తగా ఉడికి, నూనె పైకి తేలే వరకు పొయ్యి మీదే ఉంచి, దింపే ముందు కొత్తిమీరను చల్లుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అంతే వేడి వేడి చింతచిగురు చేపల పులుసు రెడీ.

చింతచిగురు అన్ని సీజన్లలో ఉండదు కాబట్టి, అది లేనప్పుడు చింతపండు రసంతో కూడా దీనిని చేసుకోవచ్చు. చిన్న చేపలతో ఇలా చేసుకుంటే తినడానికి రుచిగా ఉంటుంది.