Electric Scooter: సింగిల్‌ ఛార్జ్‌తో 212 కి.మీ. మైలేజ్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఫీచర్స్ తెలిస్తే మతిపోవాల్సిందే

Updated on: Apr 01, 2026 | 6:55 PM

ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం కూడా వాటి కొనుగోళ్లపై సబ్సిడీలు అందిస్తుండడంతో ప్రజలు కూడా కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మంచి స్కూటర్‌ కోసం చూస్తున్న వారికి టీవీఎస్ అదిరిపోయే ఫీచర్లలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తూ ఏకంగా 212 కిలో మీటర్లు వస్తుందని కంపెనీ చెప్తోంది. ఇంతకూ ఆ స్కూటర్ ఏదో చూద్దాం పదండి.

1 / 5
ప్రముఖ మొటార్ వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ సరికొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలో మీటర్లు ప్రయాణించే టీవీఎస్ ఐక్యూబ్ వాహనంతో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కొత్త రికార్డు సృష్టించింది. దీంతో కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఈ టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు ఫిబ్రవరిలో భారీగా పెరిగాయి. రుస్లాన్ వెబ్‌సైట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఐక్యూబ్ అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరిగాయి.

2 / 5
గణాంకాలను పరిశీలిస్తే, ఫిబ్రవరి 2025లో కేవలం 23,581 యూనిట్లుగా ఉన్న ఐక్యూబ్ అమ్మకాలు , ఫిబ్రవరి 2026 నాటికి 38,054 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే, ఒక సంవత్సరంలో సుమారు 14,473 అదనపు స్కూటర్లు అమ్ముడయ్యాయి. దాని అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూబ్ 61.38% వృద్ధిని నమోదు చేసింది. దీంతో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.

3 / 5
దేశంలోని టాప్-10 స్కూటర్ల జాబితాను చూస్తే, టీవీఎస్ ఐక్యూబ్ 4వ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. మొదటి 3 స్థానాలను హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి పెట్రోల్ ఇంజన్ స్కూటర్లు ఉన్నాయి. కానీ ఎలక్ట్రిక్ విభాగంలో చూసుకుంటే ఐక్యూబ్ వాటికి గట్టి పోటీ ఇస్తూ టాప్ 5 లోకి ప్రవేశించింది. ఇది భారత ఆటోమొబైల్ రంగంలో రాబోయే పెద్ద మార్పులకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఈ TVS iQube ప్రస్తుతం 3 ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ అయిన iQube 2.2 kW నుండి 3.5 kW వరకు 3 బ్యాటరీ ఆప్షన్‌లను కలిగి ఉంది, ఇది 94 kW నుండి 145 kW వరకు రేంజ్‌ను అందిస్తుంది. iQube S వేరియంట్ 145 kW రేంజ్‌ను అందిస్తుండగా, హై-ఎండ్ వేరియంట్ అయిన iQube ST 5.3 kW బ్యాటరీతో 212 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

5 / 5
ధర విషయానికి వస్తే, TVS iQube ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ. 1.08 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే, బ్యాటరీ-మాత్రమే సర్వీస్ మోడ్‌లో కొనుగోలు చేసే వారికి ఇది కేవలం రూ. 59,999 కే అందుబాటులో ఉంది. లేకపోతే, ఈ మోడ్‌లో వినియోగదారులు నెలకు రూ. 1,202 సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది.( Note: అయిదే ఇది ఒక్క ఛార్జ్‌లో 212 వస్తుందని కంపెనీ చెబుతున్నప్పటికీ రియల్‌ టైమ్‌లో ఇది తగ్గవచ్చు, రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితుల కారణంగా దీనిలో మార్పులు రావచ్చు.. కొనే ముందు వినియోగదారులు ఇది గమనించాలి)

Follow Us