Automatic Cars: ఆటోమేటిక్ కారు కొనే ప్లాన్ ఉందా? రూ. 7 లక్షలలోపు దొరికే బెస్ట్ మోడల్స్ ఇవే.. ఓ లుక్కేయండి!

|

Feb 07, 2023 | 8:19 AM

మీరు కొత్తగా కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అది కూడా ఆటోమేటిక్ కారు అయితే బెటర్ అని ఫీల్ అవుతున్నారా.? అయితే డోంట్ వర్రీ.. మీకోసం ఆప్షన్స్ తెచ్చేశాం. రూ. 7 లక్షలలోపు దొరికే ఐదు ఆటోమేటిక్ కార్లపై ఓ లుక్కేద్దాం పదండి..

1 / 5
మారుతి సుజుకి ఆల్టో కె10 దేశంలోనే అత్యంత చౌకైన ఆటోమేటిక్ కారు, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.84 లక్షలు. VXi AT వేరియంట్ లభిస్తుంది. ఇక VXi ప్లస్ AT వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.88 లక్షలు. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు 998CC పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడి 24.9 kmpl మైలేజీని అందిస్తుంది. ఇందులో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2 / 5
దేశంలో రెండవ చౌకైన ఆటోమేటిక్ కారు కూడా మారుతి సుజుకిదే. మారుతి ఎస్-ప్రెస్సో బేస్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.74 లక్షలు, టాప్ స్పెక్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.04 లక్షలు. దీనికి 998సీసీ పెట్రోల్ ఇంజిన్ సపోర్ట్ కూడా ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు లీటర్ పెట్రోల్‌తో 21.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

3 / 5
రెనాల్ట్ క్విడ్ చాలా గొప్ప ఆటోమేటిక్ కారు అని చెప్పొచ్చు. ఫ్రెంచ్ ఆటో కంపెనీ ఈ కారు బేస్ ఆటోమేటిక్ వేరియంట్‌ను రూ.5.61 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విక్రయిస్తోంది. కాగా, టాప్ స్పెక్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.83 లక్షలుగా ఉంది. దీనికి 999సీసీ పెట్రోల్ ఇంజిన్ పవర్ లభిస్తోంది. అయితే మైలేజీ పరంగా కూడా ఈ కారు చాలా బాగుంటుంది. 22 kmpl ఇస్తుంది.

4 / 5
మారుతి సెలెరియో కూడా బెస్ట్ ఆటోమేటిక్ కారు, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.37 లక్షలు VXI AMT వేరియంట్. దీని రెండవ ఆటోమేటిక్ వేరియంట్ ZXI AMT ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.65 లక్షలు. ఈ కారు 998cc పెట్రోల్ ఇంజిన్‌తో 26 kmpl మైలేజీ అందిస్తుంది.

5 / 5
టాటా టియాగో ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.75 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. దేశంలోని టాప్ 5 చౌక ఆటోమేటిక్ కార్ల జాబితాలో ఈ కారు అత్యంత శక్తివంతమైనది. ఇది 1199cc ఇంజిన్ కలిగి ఉంది. టాటా టియాగో ఒక లీటర్ పెట్రోల్‌పై 20.09 కిలోమీటర్లు ఇస్తుంది.