
రేపు చేద్దాంలే అనే బద్ధకం: చాణక్యుడి ప్రకారం.. బద్ధకం అనేది మనిషిని బ్రతికుండగానే చంపేసే విషం. రేపు చేద్దాం అనే అలవాటు ఉన్న వ్యక్తికి వర్తమానంలో గౌరవం ఉండదు, భవిష్యత్తులో అభివృద్ధి ఉండదు. అవకాశాలు అనేవి ఎప్పుడూ కదిలే నదిలాంటివి, కాలంతో పాటు ప్రవహించని వాడు ఒడ్డున మిగిలిపోయిన చెత్తలాగే ఉండిపోతాడు.

లైఫ్ లో క్రమశిక్షణ ముఖ్యం. ఇది తెలిసిన వారు ఎక్కడికి వెళ్లినా కూడా బతకగలరు. ఇంకా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడం కూడా చాలా ముఖ్యం

ఆర్థిక సంక్షోభం: చాణక్య నీతి ప్రకారం ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ముందు జాగ్రత్త చాలా అవసరం. ఆహారం, నీరు కోసం యుద్ధం చేయాల్సి వస్తాది. కొరత ఏర్పడిన చోటులో ఎక్కువ ఉండలేమని ఆచార్య చాణక్య హెచ్చరించారు.

చెడు స్నేహం: ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే, అతని స్నేహితులను చూడండి అంటారు చాణక్యుడు. బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది లేదా నల్లబడుతుంది. అలాగే చెడు లక్షణాలున్న వారితో సావాసం చేస్తే మీ వ్యక్తిత్వం కూడా మలినమవుతుంది. మీ లక్ష్యాలను గౌరవించే, మిమ్మల్ని ఉత్తేజపరిచే వారితోనే మీ ప్రయాణం సాగాలి.

తెలియని విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకోవడం మంచి అలవాటు. కొత్త పుస్తకాలు చదవడం, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాలి.

హింస , అల్లర్లు జరిగేటప్పుడు: హింస , అల్లర్లు జరిగేటప్పుడు కూడా అక్కడ ఉండకండని చాణక్యుడు చెబుతున్నాడు. గుంపులో ఉన్నప్పుడు ఏం చేయలేము అక్కడి నుంచి సైడ్ అవ్వడమే మంచిది.