ముద్ద ముద్దకీ అద్భుతమైన రుచి ఇచ్చే పచ్చిశనగపప్పు కర్రీ

Updated on: Oct 22, 2026 | 6:15 PM

రోజూ వంటింట్లో ఏం కూర వండాలా అని ఆలోచించే సమయంలో లేదా కూరగాయల బుట్ట ఖాళీగా ఉన్నప్పుడు.. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పచ్చిశనగపప్పుతో చేసుకునే ఈ కర్రీ ఒక అద్భుతమైన వరం. సాధారణంగా శనగపప్పుతో సొరకాయ పప్పు లేదా బీరకాయ కూర చేస్తుంటారు; కానీ కూరగాయలేవీ లేకుండా కేవలం శనగపప్పునే ప్రధానంగా ఉంచి, హోటల్ శైలి గ్రేవీలా వండితే పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వంటకంలో ప్రధానమైన రహస్యం ఏంటంటే.. శనగపప్పును రాత్రంతా లేదా కనీసం 6 గంటల పాటు నానబెట్టి నీరు లేకుండా నూనెలో దోరగా వేయించడం.

1 / 5
కావలసిన పదార్థాలు: 1 కప్పు పచ్చిశనగపప్పు, సన్నగా తరిగిన  2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 పెద్ద సైజు ముక్కలుగా తరిగిన టమాటా, 1 బిర్యానీ ఆకు, 5 నుండి 6 లవంగాలు, 1 చిన్నది యాలక్కాయ , చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ గరం మసాలా పొడి, 1 రెమ్మ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వంట నూనె, అర కప్పు నీళ్లు , స్పెషల్ పచ్చిమిర్చి-కొత్తిమీర పేస్ట్ కోసం, 7 నుండి 8 పచ్చిమిరపకాయలు, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న ముక్క అల్లం, అర కప్పు నిండుగా తాజా కొత్తిమీర, పేస్ట్ నలగడానికి తగినంత ఉప్పు, గమనిక: కొత్తిమీర ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి ధనియాల పొడి వేయాల్సిన పనిలేదు

2 / 5
తయారీ విధానం: ఒక కప్పు పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా కనీసం 6 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. నానిన పప్పులోని నీటిని పూర్తిగా వంపేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో 7-8 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, అర కప్పు తాజా కొత్తిమీర మరియు తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
స్టవ్‌పై బాండీ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు, 5-6 లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క ముక్క వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం మంటపై వేయించాలి. ఉల్లిపాయలు వేగాక మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి-కొత్తిమీర పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి సువాసన వచ్చే వరకు నూనెలో వేయించాలి.

4 / 5
మసాలా వేగిన తర్వాత పావు టీస్పూన్ పసుపు వేసి కలపాలి. ఇప్పుడు నీరు ఏమాత్రం లేకుండా నానబెట్టిన పచ్చిశనగపప్పును వేసి.. నూనెలోనే 2-3 నిమిషాలు ఆపకుండా కలుపుతూ చక్కగా ఫ్రై చేయాలి. ఇలా వేపడం వల్ల పప్పుకు కమ్మటి రుచి వస్తుంది. ఆ తర్వాత తరిగిన 1 పెద్ద టమాటా ముక్కలు, కరివేపాకు వేయాలి. మిక్సీ జార్‌లో అర కప్పు నీళ్లు పోసి ఆ నీటిని కూడా బాండీలో పోసి ఒకసారి బాగా కలపాలి.

5 / 5
మూతపెట్టి లో ఫ్లేమ్‌పై 5 నుండి 10 నిమిషాల పాటు నీరంతా ఇంకిపోయి పప్పు మెత్తబడే వరకు ఉడికించాలి. పప్పు ఉడికిన తర్వాత అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ గరం మసాలా పొడి వేసి కలపాలి. చివరగా పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మనైన 'పచ్చిశనగపప్పు కర్రీ' సిద్ధం! వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకుని, పక్కన కమ్మటి మిరియాల రసం లేదా టమాటా రసం నంజుకుని తింటుంటే ప్రతి ముద్దా అమృతంలా అనిపిస్తుంది; చపాతీ, పూరీల్లోకి కూడా అద్భుతమైన కాంబినేషన్!

Loading...
Unable to load recommendations.
Follow Us