మధుమేహ వ్యాధిగ్రస్తులు ముల్లంగి తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Updated on: Sep 27, 2026 | 8:34 AM

నేటి కాలంలో డయాబెటిస్ చాలా సాధారణ సమస్యగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సరైన మందులతో పాటు, రోజూ తీసుకునే ఆహార పద్ధతులు, క్రమం తప్పని వ్యాయామం చాలా ముఖ్యం. ముఖ్యంగా తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. అలాంటి కూరగాయలలో ముల్లంగి ఒకటి. మరి మధుమేహులు ముల్లంగి తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో వివరంగా తెలుసుకుందాం.

1 / 5
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు: ముల్లంగిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇందులో నీటి శాతం, డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ శరీరంలో త్వరగా అరగదు, దీనివల్ల ఇతర పిండి పదార్థాల లాగా ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచదు.

2 / 5
జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, బరువు నియంత్రణ: ముల్లంగిలోని ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల తిన్న తర్వాత కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది. ఫలితంగా తరచుగా ఆహారం తినాలనే కోరిక తగ్గి, అనవసరమైన కేలరీలు శరీరంలోకి చేరవు. టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి బరువును నియంత్రణలో ఉంచుకోవడం అత్యంత ప్రధానమైన అంశం.

3 / 5
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు: ముల్లంగిలో విటమిన్-సి, అనేక రకాల వృక్ష సంబంధిత పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో, కణాలను సంరక్షించడంలో సహాయపడతాయి. దీనిలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4 / 5
ముల్లంగిని ఎలా తీసుకోవాలి?: మధుమేహులు ముల్లంగిని పచ్చిగా సలాడ్ రూపంలో గానీ, కూర రూపంలో గానీ లేదా ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. అయితే, దీనిని ఎక్కువ నూనె, కొవ్వు పదార్థాలు లేదా తీపి పదార్థాలతో కలిపి వండకూడదు. CDC (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్) సూచనల ప్రకారం.. మధుమేహుల భోజన ప్లేట్‌లో సగం భాగం తక్కువ పిండిపదార్థాలు ఉన్న కూరగాయలతో నింపడం శ్రేయస్కరం.

5 / 5
గమనించాల్సిన ముఖ్యాంశం: ముల్లంగి తినడం వల్ల మాత్రమే మధుమేహం పూర్తిగా నయమైపోతుందని లేదా రక్తంలో షుగర్ లెవెల్స్ పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేస్తాయని భావించకూడదు. అలాగే ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని అనడానికి తగిన వైద్య ఆధారాలు లేవు. కాబట్టి వైద్యులు సూచించిన మందులను ఆపివేసి, కేవలం మూలంగిపైనే ఆధారపడకూడదు.

Loading...
Unable to load recommendations.
Follow Us