Venezuela: వెనిజులా సంక్షోభం.. పెట్రోల్ To బంగారం.. ఏయే రేట్లు చుక్కలు తాకనున్నాయి..?

Updated on: Jan 05, 2026 | 1:14 PM

అమెరికా, వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెనిజులాపై సైనిక దాడికి అమెరికా దిగడం సంచలనంగా మారింది. వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపుతున్నాయి. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే చర్చ నడుస్తోంది.

1 / 5
అమెరికా-వెనిజులా మధ్య వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. వెనిజులాపై సైనిక దాడికి అమెరికా పాల్పడటం, ఆ దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై పడుతోంది.

2 / 5
వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి రేట్లు భారీగా పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ క్లారిటీ ఇచ్చింది. వెనిజులా, అమెరికా మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు భారత వాణిజ్యంపై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

3 / 5
భారతదేశ వాణిజ్యంపై అమెరికా, వెనిజులా పరిణామాల ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని స్పష్టం చేసింది.  వెనిజులాతో భారత వాణిజ్యం భారీగా తగ్గింది. 2024-25లో క్రూడ్ ఆయిల్ దిగుమతులు వెనిజులా నుంచి 81.3 శాతం క్షీణించాయి.  అలాగే ఆ దేశంలో ద్వైపాక్షింగా కూడా తగ్గింది.

4 / 5
ఈ క్రమంలో వెనిజులా సంక్షోభం వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో తులం బంగారంపై రూ.1580 పెరిగింది. ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రూ.1,35,820 పలకగా.. సోమవారం రూ.1,37,400కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1450 పెరిగి రూ.1,25,950కి చేరుకుంది.

5 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా అవే ధరలు కొనసాగున్నాయి. ఇక చెన్నైలో బంగారం ధరల నిన్నటితో పోలిస్తే రూ.870 పెరిగింది. ఆదివారం 24 క్యారెట్ల ధర రూ.1,37,460గా ఉండగా.. సోమవారం రూ.1,38,330 వద్ద కొనసాగుతోంది. అటు 22 క్యారెట్ల ధర రూ.800 పెరగడంతో రూ.1,26,800 వద్ద ఉంది.