
ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, ఆఫీస్ కొలీగ్స్ సరదాగా మాట్లాడుకోవడానికి వాట్సప్ వీడియో కాల్ ఫీచర్ ఉపయోగించుకుంటుంటారు. ఇటీవల వీడియో కాల్ ఫీచర్ ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో వాట్సప్ మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు వీడియో కాల్ చేసుకోవాలంటే తప్పనిసరిగా వాట్సప్ కలిగి ఉండాలి. కాల్ చేసే వ్యక్తితో పాటు కాల్ రిసీవ్ చేసుకునే వ్యక్తులు కూడా వాట్సప్ కలిగి ఉండాల్సి ఉంటుంది.

అయితే ఇకపై వాట్సప్ లేకపోయినా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. అవును.. గెస్ట్ కాలింగ్ ఫీచర్‌ను మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సప్ యాప్ లేకపోయినా, వాట్సప్‌లోకి లాగిన్ కాకపోయినా వీడియో కాల్ మాట్లాడవచ్చు. ఇన్విటేషన్ లింక్ ద్వారా వాట్సప్ అకౌంట్ లేకపోయినా వీడియో కాల్లో చేరవచ్చు. ఉచితంగా ఎంతసేపు అయినా మాట్లాడటంతో పాటు కంప్యూటర్ స్క్రీన్ షేర్ చేయవచ్చు. లాగే థంబ్స్, ఎమోజీలు కూడా పంపవచ్చు.

అయితే వీడియో కాల్ లింక్ సృష్టించేవారు తప్పనిసరిగా వాట్సప్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ లింక్ అందుకున్నవారు తమ కంప్యూటర్ బ్రౌజర్ ద్వారా వీడియో కాల్లో అటెండ్ కావొచ్చు. మొబైల్ బ్రౌజర్ నుంచి పాల్గొనడానికి సపోర్ట్ చేయదు. లింక్ జనరేట్ చేసిన తర్వాత గెస్ట్‌కు పంపాలి. గెస్ట్ తమ పేరు నమోదు చేసుకుని వీడియో కాల్లో పాల్గొనవచ్చు. గరిష్టంగా 32 మంది వరకు వీడియో కాల్లో ఉండవచ్చు.

గెస్ట్‌లు నేరుగా కాల్లోకి రాలేరు. హెస్ట్ వారిని అనుమతించాల్సి ఉంటుంది. అప్పటివరకు గెస్ట్‌లు వెయిటింగ్ చేస్తూ ఉండాలి. అలాగే హోస్ట్ ఎప్పుడైనా వారిని కాల్ నుంచి రిమూవ్ చేయవచ్చు. అలాగే గెస్ట్‌గా పాల్గొనవారు ఇతర పార్టిసిపెంట్ల ఫోన్ల నెంబర్లను చూడలేరు. లాగే మెస్సేజ్‌లు పంపడం, కాల్లో వేరేవారిని చేర్చడం లాంటివి చేయలేరు. వెబ్ కాలింగ్‌కు కొనసాగింపుగా ఈ ఫీచర్ మెటా తీసుకొచ్చింది.

ఇక ఫోన్, డెస్క్ టాప్ మధ్య కాల్‌ను మార్చుకునే విధానాన్ని కూడా వాట్సప్ తీసుకొచ్చింది. అలాగే వాట్సప్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుని తమ అకౌంట్‌ను లింక్ చేసి కాల్ లింక్ జనరేట్ చేయవచ్చు. దీంతో ఇన్వైట్ అందుకున్నవారు వాట్సప్ లేకపోయినా కాల్లో చేరవచ్చు. ఈ ఏడాది చివరికల్లా ఈ ఫీచర్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.