
బైక్‌లు, కార్లకు పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనం వాడతాం. అయితే విమానాలకు ఎలాంటి ఇంధనం వాడతారనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. విమానాలకు కూడా పెట్రోల్, డీజిల్ వాడతారా?అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే విమానాలకు పెట్రోల్, డీజిల్ ఉపయోగించరు. మరి ఏ ఇంధనం ఉపయోగిస్తారు? అనే కదా మీ డౌట్. ఏవియేషన్ ప్యూచర్ అనే ప్రత్యేక ఇంధనం వీటికి వాడతారు.

ఇది కిరోసిన్ తరహాలోనే ఉంటుంది. అయితే ఇది సాధారణ కిరోసిన్‌లా కాకుండా ప్రత్యేకంగా ఉంటుంది. పెట్రోలియంను శుద్ది చేయడం ద్వారా వచ్చే ఒక హైడ్రోకార్బన్ సమ్మేళనాన్ని విమానాల్లో వాడతారు. ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. వాసన చాలా ఘాటుగా ఉంటుంది.

విమానాలకు కిరోసిన్ ఎందుకు వాడతారంటే.. వాటి ఇంధనానికి కావాల్సిన నిర్దిష్ట గుణాలు కిరోసిస్‌లో ఉన్నాయి. ఎక్కువ ఎత్తులో గడ్డకట్టకపోవడంతో పాటు వ్యర్థాలను మిగల్చకుండా మండటం, చాలా త్వరగా ఆవిరి కాకపోవడం, ఇంజిన్‌కు హాని కలిగించకపోవడం, ఎక్కువకాలం సురక్షితంగా ఉండటం, ఇంజిన్‌లోకి సరిగ్గా స్ప్రే అవ్వడం, నీరు లేదా ఘన కణాలు ఉండకపోవడం వంటివి కిరోసిన్‌లో ఉంటాయి.

ఈ గుణాలు ఉండటం వల్ల విమానాలకు కిరోసిన్ సురక్షితమైన, నమ్మదగిన ఇంధనంగా మారింది. విమానాల్లో ఉపయోగించే కిరోసిన్‌ను జెట్ ఏ1, జెట్ ఏ, జెట్ బీతో పిలుస్తారు. జెట్ ఏ1 అంతర్జాతీయ విమానాల్లో ఉపయోగిస్తారు. ఇక జెట్ ఏ అమెరికాలో వినియోగిస్తారు. జెట్ బి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటే అత్యంత చల్లని ప్రాంతాల్లో్ వాడతారు.

అయితే శిక్షణ విమానాలు, ప్రైవేట్ విమానాలు కిరోసిన్‌తో నడవవు. వాటికి ఏవియేషన్ పెట్రోల్‌ను వినియోగిస్తారు. అధిక ఆక్టోన్ కలిగిన గ్యాసోలిన్ ఇది. పిస్టన్ విమానాల కోసం దీనిని రూపొందించారు. ఇలా విమానాలకు ఉపయోగించే కిరోసిన్ ఆథారిత జెట్ ఇంధనం అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా గడ్డకట్టదు.