
దేశంలో రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో ట్రైన్లలో సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ముందుగానే టికెట్ బుక్ చేసుకుని టెన్షన్ లేని ప్రయాణం చేస్తుంటారు. అయితే రైళ్లు షెడ్యూల్ చేసిన సమయానికి రాకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు.

కొన్నిసార్లు గంటలపాటు రైలు ఆలస్యమవుతోంది. ఇలాంటి సమయంలో ఫ్లాట్‌ఫామ్స్‌పై ప్రయాణికులు పడిగాపులు కాస్తూ ఉంటారు. కొంతమంది రెస్ట్ తీసుకునేందుకు బయట హోటళ్ల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ రైల్వేశాఖ అందించే సౌకర్యాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. రైల్వే స్టేషన్లలోనే అత్యంత తక్కువ ఖర్చుతో రూమ్ పొందవచ్చు. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది.

ట్రైన్ ఆలస్యమైనప్పుడు లేదా ఇతర కారణాల వల్ల రైల్వే స్టేషన్‌లో ఎక్కువసేపు ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడే రూమ్స్ పొందవచ్చు. ప్రధాన రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తారు. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్, బెడ్, మంచాలు, సూట్ రూమ్‌లు ఉంటాయి.

మీకు నచ్చిన కేటగిరీ రూమ్‌ను ఆన్ లైన్ ద్వారా సింపుల్‌గా బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్, డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. రూ.100 నుంచి రూ.3 వేల వరకు ధర ఉంటుంది. ఈ రూమ్స్‌ను బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జర్నీ టికెట్ ఉండాలి. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఉంది.

ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో మై బుకింగ్స్‌లోకి వెళ్తే కింద రిటైరింగ్ రూమ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. అనంతరం పీఎన్‌ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం స్టేషన్ పేరు ఎంచుకోవాలి. ఆ స్టేషన్‌లో ఖాళీగా ఉన్న రూమ్స్ వివరాలు కనిపిస్తాయి. రూమ్స్, డార్మటరీలు అనే ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవాలి.

ఏసీ, నాన్ ఏసీ, బెడ్ టైప్, చెక్ ఇన్, చెక్ అవుట్, జర్నీ టైమ్ లాంటి వివరాలు నమోదు చేశాయి. అనంతరం ఖాళీగా ఉన్న రూమ్స్ కనిపిస్తాయి. ఏదైనా ధృవీకరణ పత్రం, దాని నెంబర్ నమోదు చేయాలి. ఆన్ లైన్ ద్వారా రూమ్ ఛార్జీలు చెల్లించవచ్చు. బుక్ అవ్వగానే మొబైల్ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది.